News March 16, 2025
తోటి విద్యార్థిని రెండో అంతస్తు నుంచి తోసేసిన మరో విద్యార్థిని

తిరుపతిలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి క్రిందకు తోసేసింది. దీంతో 14 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినికి గోప్యంగా చికిత్సను స్కూల్ యాజమాన్యం అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 16, 2025
భూమా అఖిలప్రియ సోదరుడిపై CMOలో ఫిర్యాదు

ఆళ్లగడ్డ MLA, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై CMOకు ఫిర్యాదు అందింది. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ ఈమేరకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అధికారిక హోదా లేకున్నా నిన్న నంద్యాల కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు, MLAలతో సమానంగా కూర్చుని అధికారులను ఆయన ప్రశ్నించడంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.
News March 16, 2025
రాజధానికి రూ.11వేల కోట్ల రుణం.. కీలక ఒప్పందం

AP: CM చంద్రబాబు సమక్షంలో హడ్కో- CRDA మధ్య ఒప్పందం జరిగింది. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్ల రుణం ఇవ్వనుంది. జనవరి 22న జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకరించగా, నేడు ఆ మేరకు ఒప్పందం జరిగింది. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో CMD సంజయ్ కుల్ శ్రేష్ఠ పాల్గొన్నారు. వచ్చే నెల ప్రధాని చేేతుల మీదుగా రాజధాని పనులు పున: ప్రారంభం కానున్నాయి.
News March 16, 2025
సీఎం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు: MP కావ్య

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంపీ కడియం కావ్య మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది అన్నారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి పదంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. నియోజకవర్గానికి రూ.800 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. 2029లో రాహుల్ గాంధీ పీఎం అవుతారన్నారు.