News April 10, 2025
తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు నమోదు

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్ పర్యటన వేళ వైసీపీ కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టడం, హెలిపాడ్ చుట్టూ బారికేడ్ల ఏర్పాటులో తోపుదుర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News April 19, 2025
ఉమ్మడి తూ.గో.లో 1278 పోస్టులు

నిరుద్యోగులు ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తర్వలో ప్రకటించనుంది. నోటిఫికేషన్ వచ్చిన 45 రోజుల్లో పరీక్షలు పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో 1278 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ప్రత్యేక విద్యకు సంబంధించి 151 స్కూల్ అసిస్టెంట్లు, 137ఎస్జీటీలు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. వయోపరిమితిని కూడా 44 సంవత్సరాలకు పెంచారు.
News April 19, 2025
జైళ్లలో ఖైదీల కోసం ప్రత్యేక ‘సెక్స్ రూమ్స్’

ఇటలీలో ఖైదీల లైంగిక కలయిక కోసం అధికారులు జైళ్లలో ప్రత్యేకంగా శృంగార గదులు ఏర్పాటు చేస్తున్నారు. 2 గంటలపాటు తమ భార్యలు, ప్రియురాళ్లతో వీరు ఏకాంతంగా గడపవచ్చు. ఆ ప్రదేశంలో గార్డుల పర్యవేక్షణ కూడా ఉండదు. కాగా ములాఖత్‌కు వచ్చే భాగస్వాములతో ఖైదీలకు శృంగారం జరిపే హక్కు ఉంటుందని అక్కడి అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో అక్కడి ఉంబ్రియా ప్రాంతంలోని జైలులో తొలి సెక్స్ గది ఏర్పాటు చేశారు.
News April 19, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మహబూబాబాద్ ఎంపీ

వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం మహా మండపంలో వేదపండితులు, అర్చకులు అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి మహదాశీర్వచనం నిర్వహించి తీర్ధ ప్రసాదములు అందజేశారు.