News September 20, 2024

త్వరలో నరసాపురానికి వందే భారత్ రైలు: మంత్రి

image

కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ విజయవాడ రైల్వే డివిజన్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులు, భద్రతా పనులపై చర్చించామన్నారు. అలాగే నరసాపురం రైల్వే స్టేషన్‌కు వందే భారత్ రైలును ఏర్పాటు చేసే విధంగా కార్యచరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Similar News

News November 25, 2024

పోలవరంలో కనువిందు చేస్తున్న ‘అడవి నాభి పుష్పాలు’

image

ప్రకృతిలో అందంగా పూసే అడవి నాభి పుష్పాలు పోలవరం నిర్మాణ ప్రాంతమైన ట్విల్ టన్నెల్‌కు వెళ్లే దారిలో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ మొక్క వేరు దీర్ఘకాలిక వ్రణాలు, కుష్ట, శరీరపు మంటలు వంటి మొదలగు వ్యాధులకు చికిత్సలో ఔషధంగా పనిచేస్తుందని, కానీ విష ప్రభావం ఉండటం వల్ల వైద్యుల సలహామేరకు తగిన మోతాదులో మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. అలంకరణకు కూడా ఉపయోగపడే ఈ మొక్క ప్రకృతికి అందాన్ని చేకూరుస్తుంది.

News November 24, 2024

ఏలూరు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ, పెళ్లి ఆ తర్వాత

image

మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిపై శనివారం కృష్ణా జిల్లా గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల మేరకు.. ఏలూరు జిల్లా వంగాయిగూడెంకు చెందిన ఓ బాలికకు గుణదలకు చెందిన రాంపండు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. బాలిక 4నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతడి కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News November 24, 2024

భీమవరం: ‘అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి’

image

భీమవరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్వామా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 368 సీ.సీ, బీ.టీ, డబ్ల్యూబీఎంలు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయవలసి ఉండగా 318 గ్రౌండ్ కాగా, మొదలు పెట్టని 50 పనులను వెంటనే చేపట్టి డిసెంబర్ నెలాఖరుకి పూర్తి చేయాలని అన్నారు. రోడ్డు నిర్మాణ పనుల పురోగతి కనబర్చకపోతే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.