News January 6, 2025

త్వరలోనే చర్యలు తీసుకుంటాం: HYDRA కమిషనర్ 

image

ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని హైడ్రా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  కాగా నేడు హైడ్రా కార్యాలయంలో చీఫ్ ఫిర్యాదులు తీసుకున్నారు. తొలిరోజే ప్రజలు ఫిర్యాదులతో హైడ్రా కార్యాలయానికి పోటెత్తారు. మొదటి రోజు 83 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైడ్రా ప్రజావాణి కొనసాగింది.

Similar News

News January 9, 2025

GHMC: జనవరి 31 లాస్ట్ డేట్, తర్వాత చర్యలే!

image

గ్రేటర్ HYD నగర వ్యాప్తంగా దుకాణ,వ్యాపార సముదాయాలు ఉన్నవారు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ తెలిపింది. జనవరి 31వ తేదీ వరకు మీసేవ, ఆన్‌లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకుని పొందొచ్చన్నారు. అంతేకాక ఫీజు పెండింగ్ సైతం 31 తేదీలోపు చెల్లించాలని, లేదంటే తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 8, 2025

HYD: బీర్ల రేటు పెంపుపై కమిటీ నిర్ణయమే ఫైనల్‌: మంత్రి 

image

బీర్ల రేట్లు పెంచనందుకు బీర్ల స్టాక్ పంపమని బేవరేజ్ సంస్థ ప్రకటించింది. 33శాతం పెంచమని అడుగుతున్నారని, ఇలా పెంచితే ఇప్పుడు రూ.150 రూపాయలు ఉన్న బీర్ రూ.250 పెరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బేవరేజ్ సంస్థ అడిగినట్లు రేట్లు పెంచితే ప్రజలపై భారం పడుతుందన్నారు. రేట్లు పెంచే సిస్టం కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక వచ్చాక రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

News January 8, 2025

HYD: 2024లో జైళ్లకు 41,138 మంది ఖైదీలు: డీజీ

image

2024లో వివిధ కేసుల్లో జైలుకు వచ్చిన వారి సంఖ్య భారీగా పెరిగిందని, ఈ ఏడాదిలో 41,138 మంది జైలుకు వచ్చారని ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. HYDలో సౌమ్య మిశ్రా జైళ్ల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. 2024లో హత్యకేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. 2024లో పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు చెప్పారు.