News March 20, 2025
త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్: పరిగి MLA

త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఏర్పాటు కానుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. షాద్‌నగర్ పరిగి మధ్యలోని లక్ష్మీదేవిపల్లి దగ్గర సాగునీటి ప్రాజెక్టు నిర్మించి, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగునీరు, తాగునీరు అందించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఇప్పటికి కూడా కోర్టు కేసులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
Similar News
News March 21, 2025
వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఓ యువకుడు ఉద్యోగం సాధించి మొదటి రోజు విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ధారూర్ మండలం కేరేల్లి గ్రామానికి చెందిన నవీన్(26) నిన్న ఉద్యోగానికి వెళ్లి వస్తుండగా కోకపేట టీగ్రీల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై నర్సింగ్ పోలీసుకు కేసు నమోదు చేశారు.
News March 21, 2025
ట్రంప్‌కు ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. భారతీయ రీసెర్చర్ బాదర్ ఖాన్‌ను US నుంచి బహిష్కరించొద్దని వర్జీనియా కోర్టు ఆదేశించింది. బాదర్ ఖాన్‌కు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ట్రంప్ ప్రభుత్వం అతడిని గత సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అరెస్టును సవాల్ చేస్తూ బాదర్ ఖాన్ కోర్టును ఆశ్రయించగా అతడికి కోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
News March 21, 2025
అంగన్వాడీల్లో పిల్లలను సొంతపిల్లల్లా చూసుకోవాలి: అనిత రామచంద్రన్

అంగన్వాడి పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మహిళా శిశు సంక్షేమం దివ్యాంగ వయోవృద్ధుల శాఖ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లల అంగవైకల్యం తదితర అంశాలపై సిడిపిఓలు, సూపర్ వైజర్లు సఖీ ఐసిపిఎస్ అధికారులు, సిబ్బందితో ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు.