News December 29, 2024
దక్షిణ భారతదేశంలోనే శ్రీకాకుళం జిల్లా భామిని టాప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735389794887_51511373-normal-WIFI.webp)
భామిని మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని శనివారం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. నీతి ఆయోగ్ ప్రతి త్రైమాసికంలో సూచికల సాధనను విశ్లేషిస్తుంది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన బ్లాకులను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలోనే భామిని ఆస్పిరేషనల్ బ్లాక్ అగ్రస్థానంలో నిలవడంతో ప్రోత్సాహకంగా రూ.1.50 కోట్లు పొందిందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 5, 2025
శ్రీకాకుళం జిల్లా బెంతు ఒరియా అధ్యక్షుడిగా రజనీ కుమార్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738763535073_51977029-normal-WIFI.webp)
బెంతు ఒరియాల శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా బల్లిపుట్టుగకు చెందిన రజనీ కుమార్ దొళాయిని నియమితులయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో సంఘం సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఉన్న శ్యాంపురియా ఇటీవల మృతి చెందడంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా బెంతు ఒరియా కుల సంఘం అధ్యక్షుడిగా రజిని కుమార్ దోళాయి, ఉపాధ్యక్షుడిగా ఢిల్లీ మజ్జి, తదితరులను ఎన్నుకున్నారు.
News February 5, 2025
1.20లక్షల మందికి సూర్యనారాయణ స్వామి దర్శనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738749449926_71674880-normal-WIFI.webp)
అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా అధికారుల ప్రోద్భలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయని కొనియాడారు. ఈఏడాది సూర్యనారాయణ స్వామిని 1.20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు.
News February 5, 2025
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738717187104_934-normal-WIFI.webp)
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చాపురం మండలం అందెపల్లి గ్రామానికి చెందిన ఉదయ్(25) మృతి చెందాడు. యువకుడు లింగోజిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. మంగళవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు బైక్పై వెళ్లి తిరిగొస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఉదయ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.