News March 5, 2025

దాచేపల్లి: సచివాలయ ఉద్యోగి వీడియో.. స్పందించిన లోకేశ్

image

పల్నాడు జిల్లా దాచేపల్లిలో సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బులతో పారిపోయాడు. ఈ మేరకు నిన్న క్షమించండి, డబ్బులు కట్టేస్తానంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. మనుషులుగా తప్పులు చేస్తుంటాం, కానీ వాటి నుంచి మంచి నేర్చుకోవటం ముఖ్యం. మీ కుటుంబానికి తొలి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లకండి అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Similar News

News December 19, 2025

అన్నమయ్య: పదో తరగతి విద్యార్థులకు గమనిక

image

10వ తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపునకు శుక్ర, శనివారం వరకు అవకాశం ఉందని అన్నమయ్య DEO సుబ్రహ్మణ్యంరెడ్డి వెల్లడించారు. రూ.500 ఫైన్‌తో విద్యార్థులు హెచ్ఎం లాగిన్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. తక్కువ వయసున్న విద్యార్థులు వయసు మినహాయింపు ఫీజును బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో కట్టాల్సి ఉంటుందని సూచించారు. ఒకేషనల్ విద్యార్థులు సైతం అదే వెబ్ సైట్ నుంచి ఫీజు కట్టొచ్చని తెలిపారు.

News December 19, 2025

జడ్చర్ల: నేటి నుంచి మైనార్టీ గురుకుల క్రీడలు

image

తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యార్థుల ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు (జోష్-2025) శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జడ్చర్ల మండల కేంద్రంలోని మైనార్టీ బాలుర పాఠశాల వేదికగా ఈ నెల 21 వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఖాజా బహుద్దీన్ తెలిపారు. 3వ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా అథ్లెటిక్స్, ఖో-ఖో, కబడ్డీ వంటి వివిధ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటనున్నారు.

News December 19, 2025

అనకాపల్లి: జిల్లా పోలీసులను అలర్ట్ చేసిన ఎస్పీ

image

అనకాపల్లిలో గురువారం కెనరా బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. బ్యాంకులో దొంగతనానికి యత్నించిన దుండగులను పట్టుకోవడానికి ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక బృందాలను నియమించారు. సీసీ ఫుటేజీలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అనుమానితులపై ఆరా తీయాలని అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.