News April 5, 2025
దామెర: తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె..!

హనుమకొండ జిల్లా దామెర మండల పరిధి లాదెల్ల గ్రామంలో లాదెల్ల బిక్షపతి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. భిక్షపతికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు లేకపోవడంతో కుమారుడి బాధ్యత పెద్ద కుమార్తె అయిన శోభారాణి తీర్చారు. మృతుడి దహన సంస్కారాలకు హాజరైన బంధుమిత్రులు, గ్రామ ప్రజలు శోభారాణి తలకొరివి పెట్టడం చూసి కన్నీరు మున్నీరయ్యారు.
Similar News
News April 7, 2025
జగన్ పర్యటనను అడ్డుకుంటాం: MRPS

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గ పర్యటనను అడ్డుకుంటామని MRPS క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ బీసీఆర్ దాస్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాతే జిల్లా పర్యటనకు రావాలని స్పష్టం చేశారు. మండలిలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తమ నేతలతో కలిసి జగన్ పాపిరెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన విడుదల చేశారు.
News April 7, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి!

ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి శ్రీరామనవమి రోజున ఒక్కటయ్యారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కుటుంబ సభ్యులు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
News April 7, 2025
మేడ్చల్ జిల్లాలో విపరీతంగా ఉక్కపోత..!

మేడ్చల్ జిల్లాలో ఉక్కపోత రోజురోజుకు అధికమవుతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఉప్పల్, ఈసీఐఎల్, మేడ్చల్, మల్లాపూర్ ప్రాంతాల్లో తీవ్ర ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా తగినన్ని నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు పట్ల మరింత జాగ్రత్త పడాలన్నారు.