News August 31, 2024
దిలీప్ ట్రోఫీ.. నేడే ఫ్రీ పాసుల జారీ

అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ మైదానంలో నేటి నుంచి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు సంబంధించి ఉచిత పాసులు ఇవ్వనున్నట్లు ఏసీఏ త్రిసభ్య కమిటీ సభ్యుడు మాంచో ఫెర్రర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి పాసులు జారీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 5 నుంచి జరగనున్న మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించాలంటే పాసులు తప్పనిసరి అని తెలిపారు. ఈ టోర్నీలో గిల్, రాహుల్, SKY, రుతురాజ్, కుల్‌దీప్ తదితర ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు.
Similar News
News March 14, 2025
వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్ ఎంపికయ్యారు. గుత్తి మండలం బేతపల్లికి చెందిన వైసీపీ నేతలు సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తదితరులు మల్లయ్య యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ముందుగా మల్లయ్యను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి సన్మానించారు. రైతుల సమస్యల పట్ల పోరాడుతానన్నారు. తనను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News March 14, 2025
ఎంటెక్ ఫలితాల విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పీ.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కే.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 14, 2025
డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా: ఎస్పీ

మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, ఇబ్బందులు కలిగించడం వంటివి చేయరాదన్నారు. కీలక ప్రదేశాలు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలు ఉండటంతో పాటు డ్రోన్లతో నిఘా పెట్టామన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కుట్రలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.