News April 3, 2025

దివ్యాంగులందరికీ యూడిఐడి స్మార్ట్ కార్డులు: MHBD కలెక్టర్

image

దివ్యాంగులందరికీ యూడిఐడి స్మార్ట్ కార్డులు ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం వైకల్య ధ్రువపత్రాన్ని సదరం శిబిరంలో తగు వ్యాలిడిటితో కాగితరూపంలో ఇస్తున్నారన్నారు. ఇక ఈ సమస్యలు లేకుండా యూడిఐడి నంబరును కేటాయించి స్మార్ట్ కార్డులు జారీచేయాలని కేంద్రం నిర్ణయించినట్లు, ఇందుకోసం ప్రత్యేకంగా https://www.swavlambancard.gov.in పోర్టల్ రూపొందించిందన్నారు.

Similar News

News April 4, 2025

తుర్కపల్లి: పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్

image

తుర్కపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన పంట పొలాలను కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలను తెలుసుకున్నారు. మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిలిందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ అధికారులను ఆయన ఆదేశించారు.

News April 4, 2025

IIT హదరాబాద్‌కు విరాళమిస్తే నో టాక్స్

image

ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్‌కు విరాళమిచ్చే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ విద్యా సంస్థకు విరాళం ఇస్తే ఆ మొత్తానికి సంబంధించి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో 50% పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇపుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 80జీ ప్రకారం విరాళాలు టాక్స్ ఫ్రీ అని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు.

News April 4, 2025

15th ఫైనాన్స్‌కు మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎంపిక

image

కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లకు గ్రాంట్లు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన 15వ ఫైనాన్స్‌కు ఈసారి మన మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ ఎంపికైంది. ఈ ఎంపికను ఆస్తి పన్నులను 21 శాతం వసూలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం పాలమూరుకు అవకాశం కల్పించింది. ఇక నేడో రేపో మహబూబ్‌నగర్ నగర పాలక సంస్థకు రూ.30 కోట్ల గ్రాంట్స్‌ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.

error: Content is protected !!