News February 25, 2025
దుద్యాల్: లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్

లగచర్ల రైతులు స్వచ్ఛందంగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి సహకరిస్తున్నారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్‌కు సంబంధించి తమ భూమి స్వచ్ఛందంగా ఇచ్చిన 22 మంది రైతులకు చెక్కులు పంపిణి చేశారు. భూములు ఇస్తున్న రైతులకు నష్టపరిహారాలు అందించి ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.
Similar News
News February 25, 2025
రేపు విశాఖ రానున్న బ్రహ్మానందం

శివరాత్రి సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో బుధవారం మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మహా కుంభమేళా పవిత్ర జలాలతో అభిషేకం చేయనున్నట్లు వెళ్లడించారు. రేపు ఉదయం 9.30 గంటల నుంచి కోటీ 8 లక్షల శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం హాజరుకానున్నారని వెల్లడించారు.
News February 25, 2025
ఏడాదికి 2 సార్లు టెన్త్ ఎగ్జామ్స్: CBSE

సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్ పరీక్షలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 17-మార్చి 6 మధ్య తొలి దశ, మే 5-20 మధ్య రెండో దశ పరీక్షలు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలకు CBSE ఆమోదం తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.
News February 25, 2025
గుర్రంపోడు తహశీల్దార్ సస్పెండ్

విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా, జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసినందుకుగాను సెలవులో ఉన్న గుర్రంపోడు తహశీల్దార్ జి.కిరణ్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు గత నెల 6 నుంచి 16 వరకు కలెక్టర్ సెలవులు మంజూరు చేశారు. గడువు దాటినా విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేశారు.