News April 7, 2025
దుబాయ్‌లో అయిలాపూర్ వాసి మృతి

కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన గాజర్ల శ్రీనివాస్ గౌడ్ (55) ఆదివారం రాత్రి దుబాయ్‌లోని తన గదిలో గుండెపోటుతో మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. శ్రీనివాస్ ఐదేళ్లుగా దుబాయ్‌లో పనిచేస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Similar News
News April 8, 2025
ఇల్లు కట్టుకునే వారికి బ్యాడ్ న్యూస్

ఏప్రిల్‌లో సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని, ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ధరలు పెరుగుతాయని NUVAMA రిపోర్ట్ తెలిపింది. ప్రభుత్వ వ్యయం ఎక్కువవుతుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా మూడు నెలలు పెరుగుతూ వచ్చిన సిమెంట్ ధరలు మార్చిలో తగ్గాయి. ఈనెల సౌత్ రీజియన్‌లో బస్తాకు రూ.30 చొప్పున పెరిగే అవకాశముందని పేర్కొంది.
News April 8, 2025
ఏలూరు: ఇద్దరు దొంగలు అరెస్ట్

ఏలూరు 3వ పట్టణం పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన గాల్సిద్ (29), రాజశేఖర్ (27) మిత్రులన్నారు. చెడు అలవాట్లకు బానిసై పార్క్ చేసిన స్కూటీ డిక్కీ లోని నగదును కాజేసేవారని, ఇదే స్టైల్‌లో ఏలూరులో రెండు దొంగతనాలు జరగగా అరెస్టు చేసి రూ.5 లక్షలు రికవరీ చేశామన్నారు.
News April 8, 2025
టీచర్ల నియామకాల రద్దుపై రాష్ట్రపతికి రాహుల్ లేఖ

పశ్చిమ బెంగాల్‌లో 25వేల టీచర్ పోస్టుల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు. న్యాయంగా ఎంపికైన అభ్యర్థులను టీచర్లుగా కొనసాగించాలని కోరారు. అనర్హులతో పాటు అర్హులు కూడా నష్టపోతున్నారని, ఈ విషయంలో కలగజేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. తాను ఉన్నంత వరకు అభ్యర్థులకు అన్యాయం జరగదని బెంగాల్ CM మమత ఇప్పటికే స్పష్టం చేశారు.