News March 4, 2025

దుబాయ్‌లో కామారెడ్డి జిల్లా వాసి మృతి

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నరేశ్ దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న నరేశ్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఫిబ్రవరి 24 నరేశ్ సూసైడ్ చేసుకున్నాడు. కాగా ఇవాళ ఉదయం డెడ్ బాడీ గ్రామానికి చేరుకుంది. నరేశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 4, 2025

అంగన్వాడీల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం

image

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణికి అంగన్వాడీలు వినతి పత్రాన్ని మంగళవారం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 42 గంటల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. 10వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News March 4, 2025

పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

image

పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు పగ్గాలు అప్పగించింది. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్‌ను పక్కనపెట్టింది. అయితే వన్డేలకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్సీ చేస్తారని వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.

News March 4, 2025

దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

image

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవారం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.

error: Content is protected !!