News February 27, 2025

దుబ్బరాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

image

సారంగాపూర్ మండలంలోని పెంబట్ల-కోనాపూర్ గ్రామంలో కొలువైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేకువజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడెమొక్కులు, కుంపటి గజాశూలం మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భక్తులకు సరైన సౌకర్యాలు లేవని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News February 27, 2025

గుడ్లు తినేవారు ఈ తప్పులు చేస్తున్నారా?

image

గుడ్లు అంటే చాలామందికి ఇష్టం. వాటిని వండేటప్పుడు, తినేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లను అతిగా ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయి. 20 నిమిషాలపాటు ఉడికించాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లు తినకూడదు. దానిలో ఉండే రుచి తగ్గిపోతుంది. గుడ్లను నేరుగా పాన్ లేదా వంటపాత్రలో పగలగొట్టకూడదు. గుడ్డు పెంకుపై ఉండే బ్యాక్టీరియా వీటిలోకి చేరుతుంది. వేరే పాత్రలో ఫిల్టర్ చేశాకే ఉపయోగించాలి.

News February 27, 2025

దేశంలోనే తొలిసారి పిల్లులకు బర్డ్ ఫ్లూ!

image

కోళ్లకు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న వేళ మధ్యప్రదేశ్‌ చింద్వారా జిల్లాలో దేశంలోనే తొలిసారి ఓ పెంపుడు పిల్లిలో ఈ H5N1 వైరస్ బయటపడింది. దీంతో మనుషులకూ సోకే అవకాశం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. కరోనా మాదిరిగానే ఈ వైరస్ ఆకృతి మార్చుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రాణాంతకం కాదంటున్నారు. కాగా అమెరికా సహా పలు దేశాల్లో జంతువులు, మనుషులకూ ఈ వైరస్ సోకింది.

News February 27, 2025

గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిశంకర కాలేజీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టాటా ఏసీ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!