News August 13, 2024

దేవరకొండ: షాపింగ్‌కి వెళ్లి వచ్చేసరికి దొంగతనం

image

దేవరకొండ పట్టణం గాంధీ నగర్‌కి చెందిన RTC ఉద్యోగి నేనావత్ చందు సువర్ణ ఇంట్లో దొంగతనం జరిగింది. మూడు గంటల సమయంలో తాను షాపింగ్‌కి వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 6 తులాల బంగారు గొలుసు, 60 తులాల వెండి, 19 వేల నగదు అపహరించారని సువర్ణ పోలీసులకి ఫిర్యాదు చేశారు. గంటన్నరలోనే చోరీ చేశారని ఆమె విలపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI తెలిపారు

Similar News

News November 25, 2024

నల్గొండ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా తృప్తి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వంటగదిని, డైనింగ్ హాల్, పరిసరాలను, ఆటస్థలాన్ని, తరగతి గదులను తనిఖీ చేయడమే కాకుండా విద్యార్థినులు, వంట వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో కలిసి భోజనం చేశారు.

News November 24, 2024

NLG: సర్పంచుల సంఘం జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్

image

సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని HYDలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి ప్రెస్ మీట్‌కి వస్తే పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం JAC నాయకులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయనప్పటికీ, రూ.750 కోట్లు విడుదల చేశామని సీఎం అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో పలువురు ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ సర్పంచులు ఉన్నారు.

News November 24, 2024

ఎస్సీ వర్గీకరణ బాధ్యత కాంగ్రెస్ పార్టీదే: మంత్రి రాజనర్సింహ

image

ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ దేనని ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ అన్నారు. నల్గొండ ఆదివారం నిర్వహించిన మాదిగ, ఉప కులాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణతో ఎవరి హక్కులు భంగం కలగదని, తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటాలు పంచుకోవడమే తప్ప మరొకటి కాదన్నారు.