News January 12, 2025
దేవరపల్లి హైవే పై యాక్సిడెంట్.. స్పాట్‌డెడ్

దేవరపల్లి మండలం సూర్యనారాయణ పురం హైవే పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మృతుడు కందిపల్లి సత్యనారాయణ (26)గా గుర్తించారు. పండుగ నిమిత్తం హైదరాబాద్ నుంచి స్వగ్రామం బిక్కవోలుకు బైక్ పై వస్తున్నాడు. యర్లగూడెం టోల్‌గేట్ దాటిన తర్వాత బైక్ పై వెనుక కూర్చున్న సత్యనారాయణ నిద్ర మత్తులో కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Similar News
News April 23, 2025
ప.గో: అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

భవ్య భీమవరం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మంగళవారం కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ భవ్య భీమవరం సుందరీకరణ, మౌలిక వసతులు అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల పురోగతి, ఇంకా చేపట్టవలసిన పనులపై మున్సిపల్ అధికారులు,దాతలతో సమావేశమై సమీక్షించారు. కాస్మో పోలిటన్ క్లబ్ వద్ద వంశీకృష్ణ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.
News April 22, 2025
ఇబ్బందులు ఉంటే రైతులు తెలపాలి: జేసీ

ఉండి మండలం యండగండి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతు సేవ కేంద్రం ద్వారా కొనుగోలు సక్రమంగా జరుగుతుందా, అధికారులు మీకు సహకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలపాలన్నారు. రైతులతో కలిసి తేమ శాతం పరిశీలించారు.
News April 22, 2025
భీమవరం లాడ్జిలో పోలీసుల తనిఖీలు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ రెసిడెన్షియల్ & లాడ్జిపై టూ టౌన్ సీఐ కాళీ చరణ్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో 9మంది అమ్మాయిలు, 9మంది అబ్బాయిలు ఉన్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లాడ్జి నిర్వాహకుడు అంతం శ్రీను పరారైనట్లు స్థానికులు తెలిపారు.