News March 23, 2025
దేవాదుల పంప్ హౌస్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు

హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట గ్రామంలో గల దేవాదుల పంప్ హౌస్‌ను ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సందర్శించి మోటార్లను పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలోనే దేవాదుల నుంచి రైతులకు నీరు అందిందని.. ఈ కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు ను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
Similar News
News March 29, 2025
అనుమానస్పద స్థితిలో యువతి మృతి

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.
News March 29, 2025
ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ ఆగిపోతుంది: DSO

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ చేయకపోతే మే 1వ తేదీ నుంచి రేషన్ నిలిపేస్తామని DSO కోమలి పద్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్ కార్డు దారులు ఏప్రిల్ చివరి వరకు ఈ-కేవైసీ చేయించుకోవచ్చన్నారు. మొత్తం జిల్లాలో 5.99 లక్షల కార్డులు ఉండగా.. ఇప్పటి వరకు 4.70 లక్షల మంది ఈ-కేవైసీ అప్డేట్ చేయించారన్నారు. మిగిలిన వారు కూడా ఈ-కేవైసీ పూర్తి చేయించాలన్నారు.
News March 29, 2025
జనగామ: LRS చెల్లించాల్సింది రూ.లక్షల్లో.. చూపించింది రూ.కోట్లల్లో!

25% రాయితీతో LRS దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. అయితే గడువు దగ్గర పడుతుండటంతో దరఖాస్తుదారులు LRS చెల్లించడానికి వెబ్ పోర్టల్ ఓపెన్ చేయగా.. రూ.లక్షల్లో కట్టాలన్సిన ఫీజు రూ.కోట్లలో చూపించడంలో ఒక్కసారిగా కంగుతున్నారు. పట్టణానికి చెందిన నరసింహ 132.86 చదరపు గజాలకు LRS ఫీజు చెల్లించేందుకు పోర్టల్ ఓపెన్ చేయగా రూ.1.11,92,567 చూపించడంతో షాక్ అయ్యాడు.