News April 6, 2025
దేవీపట్నం: ‘మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యనే హత్య చేశాడు’

దేవీపట్నం(M) పాముగండికి చెందిన కె.గంగన్నదొర మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని అతని భార్య పాపయమ్మ (28) హత్య చేసాడని ఎస్సై షరీఫ్ ఆదివారం తెలిపారు. తాగుడుకు అలవాటు పడిన గంగన్న దొర నిత్యం డబ్బులు కోసం ఆమెను వేధించేవాడని పేర్కొన్నారు. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని ఆమెను కర్రతో తీవ్రంగా కొట్టి, గొంతు నొక్కి చంపాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News April 17, 2025
పటాన్‌చెరు: ఇక్రిశాట్‌లో చిక్కిన చిరుత

పటాన్‌చెరు శివారులోని ఇక్రిశాట్ పరిశ్రమలో <<16105958>>చిరుత పులి<<>> చిక్కింది. చిరుత పులుల ఆనవాళ్లు లభ్యం కావడంతో గత రెండ్రోజులుగా కార్మికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో బోన్లు, సీసీ కెమెరాలు బిగించారు. చిరుత కోసం బోన్‌లో రెండు మేకలను ఎరగా వేశారు. బుధవారం రాత్రి మేకలను వేటాడటానికి వచ్చిన చిరుత పట్టుబడింది. చిరుతను జూపార్క్‌కు వాహనంలో తరలించినట్లు తెలుస్తోంది.
News April 17, 2025
GNT: లీప్ యాప్ ప్రారంభం, పాఠశాల యాప్‌లకు ఒకే చిరునామా

పాఠశాలల యాజమాన్యంలో మార్పుల దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉన్నత విద్యాశాఖ తీసుకొచ్చిన లీప్ యాప్ బుధవారం నుంచి ఉపాధ్యాయుల వినియోగంలోకి వచ్చింది. హాజరు నమోదు, విద్యార్థుల వివరాలు, పలు సేవలు ఇందులో కేంద్రీకరించారు. ఇప్పటికే ఉపాధ్యాయులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎలాంటి సమస్యలు లేకుండా వినియోగిస్తున్నారు. స్కూల్ అటెండెన్స్ యాప్‌ను తొలగించి లీప్‌కి మారడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
News April 17, 2025
KNR బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

KNR బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్, జిల్లా లీగల్ సెల్ ఛైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఎన్నికల వివరాలను తెలుసుకుని అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజును మంత్రి పొన్నం ప్రత్యేకంగా అభినందించారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.