News April 5, 2025
దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం: మంత్రి ఉత్తమ్

ఆహార భద్రత విషయంలో దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో సన్న బియ్యం లబ్ధిదారులు పాలడుగు వెంకటయ్య నివాసాన్ని సందర్శించి వారితో కలిసి భోజనం చేసి మాట్లాడారు. సన్నబియ్యం పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలందరికీ మేలు జరుగుతుందని, గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.
Similar News
News April 13, 2025
ఇల్లు కొనాలనే తొందరలో తప్పులొద్దు!

సొంతిల్లు కొనాలనే తొందరలో కొందరు చేసే చిన్న తప్పులే మున్ముందు చాలా ఇబ్బందులు తెస్తాయి. ముందుగా అసలు ఇల్లు ఎందుకు కొనాలని అనుకుంటున్నామో స్పష్టత ఉండాలి. ఏ ప్రాంతంలో కొంటున్నాం? అక్కడ వృద్ధి ఎలా ఉంటుంది? అద్దెకు ఇస్తే ఆదాయం ఎంతొస్తుంది? ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తున్నామా? తదితర ప్రశ్నలు వేసుకోకపోతే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News April 13, 2025
ASF: తాటి ముంజలకు భలే గిరాకీ

ఎండాకాలం వచ్చిందంటే వేడి తాపానికి ఉపశమనం కలుగజేసే తాటి ముంజలు జిల్లాలో అందుబాటులో లభిస్తాయని ప్రజలు అంటున్నారు. శనివారం వాంకిడి మండలకేంద్రంలో తాటి ముంజల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రజలు ముంజలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముంజలు తింటే ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయని వైద్యలు సూచించడంతో కొనడానికి మక్కువ చూపుతున్నారు.
News April 13, 2025
కడెం: ఉరేసుకొని యువతి ఆత్మహత్య

ఉరివేసుకొని యువతి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన అనూషను(21) శుక్రవారం సాయంత్రం ఓ విషయంలో తల్లి మందలించింది. మనస్తాపానికి గురై ఇంటి పక్కన ఉన్న షెడ్డులో ఉరేసుకుంది. అనూష తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.