News March 14, 2025
దైరతుల్ మారిఫిల్ డైరెక్టర్‌గా ప్రొ. షుకూర్

ఉస్మానియా యూనివర్సిటీలోని దైరతుల్ మారిఫిల్ ఉస్మానియా డైరెక్టర్‌గా ప్రొ. ఎస్ఏ షుకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఓయూ వీసీ ప్రొ. కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. పురాతన తాళపత్ర గ్రంథాలు, అరబిక్ గ్రంథాలను భద్రపరిచేందుకు నిజాంపాలనలో నెలకొల్పిన ఈ కేంద్రం ఓయూకు అనుబంధంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన షుకూర్ తిరిగి అదే పదవిలో నియమితులయ్యారు.
Similar News
News March 14, 2025
HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.
News March 14, 2025
హోలీ సందర్భంగా నేడు ప్రజావాణికి సెలవు

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య తెలిపారు. దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఈ నెల 18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని దివ్య సూచించారు.
News March 14, 2025
HYDలో ప్రప్రథమ శారీ డ్రాపింగ్ ఈవెంట్.. @మాంగళ్య షాపింగ్ మాల్

భారతీయ సంస్కృతికి చిహ్నం చీర కట్టు.. HYDలో ప్రప్రథమంగా మాంగళ్య షాపింగ్ మాల్ వారు శారీ డ్రాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. వనస్థలిపురంలోని షాపింగ్ మాల్లో చెన్నైకి చెందిన ప్రముఖ శారీ డ్రాపర్ కవిత చీర కట్టు ఎలా ఉండాలనే అంశాలను వివరించారు. ఆసక్తిగా గమనించిన ఫ్యాషన్ డిజైనర్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు యాజమాన్యాన్ని అభినందించారు. ఛైర్మన్ కాసం నమశ్శివాయ, డైరెక్టర్లు పాల్గొన్నారు.