News March 20, 2025

దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి

image

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.

Similar News

News March 21, 2025

జీవీఎంసీలో మారనున్న పార్టీల బలాబలాలు

image

జీవీఎంసీలో పార్టీల బలాబలాలు మారనున్నాయి. 97 వార్డుల్లో అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌గా హరి వెంకట కుమారి ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో జీవీఎంసీపై ప్రభావం పడింది. 9 మంది కార్పొరేటర్ టీడీపీలో చేరగా.. ఒక కార్పొరేటర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కూటమి బలం పుంజుకుంది. కాగా అవిశ్వాస తీర్మాన అంశం తెరపైకి వచ్చింది.

News March 21, 2025

విశాఖలో అడ్మిషన్స్‌కు ఆహ్వానం

image

భీమిలి, ఆనందపురం, పద్మనాభం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి బాలికలకు అడ్మిషన్స్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు పథక సమన్వయకర్త చంద్ర శేఖర్ గురువారం తెలిపారు. 6వ తరగతిలో 120 సీట్లు,11వ తరగతిలో 120 సీట్లు, 7వ తరగతిలో 2 సీట్లు,12వ తరగతిలో 23 సీట్లకు ఆన్ లైన్‌లో మార్చ్ 22నుంచి ఏప్రిల్ 11లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డు ఉన్న బాలికలు మాత్రమే అర్హులు.

News March 21, 2025

విశాఖలో ఆశీల వసూళ్లకు బహిరంగ వేలం

image

జీవీఎంసీ జోన్ -3 పరిధిలో 2025-26 సంవత్సరానిగాను పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోన్-3వ జోనల్ కమిషనర్ శివప్రసాద్ గురువారం తెలిపారు. జోన్-3లో మార్కెట్లు, లుంబిని పార్క్ ప్రవేశానికి, పార్కింగ్ టికెట్ వసూలు చేసేందుకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆశీలుమెట్ట జీవీఎంసీ జోన్ -3 జోనల్ కార్యాలయంలోని హాజరు కావాలన్నారు.

error: Content is protected !!