News March 19, 2025
దోచిన సొత్తును శ్మశానంలో దాచేవాడు: ఖమ్మం సీపీ

చాట్రాయి(M) చిత్తాపూర్‌కు చెందిన సురేందర్ దొంగతనాలు చేయడంలో టెక్నాలజీని ఉపయోగించాడని ఖమ్మం సీపీ సునీల్ దత్ మంగళవారం తెలిపారు. Google MAP ద్వారా సురేందర్ ఇంటిని మార్క్ చేసి, కొల్లగొట్టి, దొంగలించిన సొత్తును శ్మశానంలో దాచుకున్నాడని చెప్పారు. సదరు నిందితుడి నుంచి 461.19 గ్రాముల బంగారం, 425 గ్రాముల వెండి, రూ.3.32లక్షలు సీజ్ చేశామన్నారు. గత 3 నెలల్లో ఏలూరు, ప.గో.జిల్లాల్లో 43 కేసులు నమోదు అయ్యాయన్నారు.
Similar News
News November 1, 2025
KMR: ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు వినతి

కామారెడ్డిలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను కోరారు. శనివారం కామారెడ్డి R&B గెస్ట్ హౌస్‌లో జిల్లా ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజ్ వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
News November 1, 2025
జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ లో గర్రెపల్లి సత్తా

రెండ్రోజులుగా పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ లో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి క్రీడాకారులు సత్తా చాటారు. షటిల్ విభాగంలో గర్రెపల్లి నుంచి పలు జట్లు పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. నిర్వాహకులు క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కాగా, జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్న క్రీడాకారులను గర్రెపల్లి గ్రామస్తులు అభినందించారు.
News November 1, 2025
హోంమంత్రి పనితీరును ప్రశంసించిన సీఎం

హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. మొంథా తుఫాన్‌లో మంత్రి ప్రజలకు రక్షణ సహాయక చర్యల్లో పాల్గొని సేవలందించారన్నారు. ఈ మేరకు శనివారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రికి ప్రశంసాపత్రం, ఉత్తమ సేవా అవార్డును సీఎం అందజేశారు. ప్రజాసేవలో సీఎం చంద్రబాబు చూపిన మార్గం తమకు ఆదర్శం అని హోంమంత్రి అన్నారు.


