News March 18, 2024
దోమకొండ: ఆరోగ్య శాఖ మంత్రికి షబ్బీర్ అలీ వినతి

దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకలకు మార్చాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని షబ్బీర్ అలీ తెలిపారు. వంద పడకల ఆసుపత్రిగా మార్చితే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
Similar News
News April 19, 2025
NZB: సన్న బియ్యం లబ్ధిదారులతో మైనారిటీ కమిషన్ ఛైర్మన్ భోజనం

నిజామాబాద్ గౌతంనగర్‌లో సన్న బియ్యం లబ్ధిదారుడైన లింబాద్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ శనివారం సన్న బియ్యంతో వండిన అన్నంతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడిని, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
నిజామాబాద్: లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ: కలెక్టర్

జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ సాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, సంబంధిత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ జరుగుతుందని వివరించారు.
News April 19, 2025
NZB: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య..

నిజామాబాదు లో గూడ్స్ రైలు కిందపడి గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి శుక్రవారం తెలిపారు. స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహన్ని మార్చురికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు.