News March 1, 2025

దోమలో బాలికపై యువకుడి అఘాయిత్యం

image

నాలుగేళ్ల బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన దోమ PS పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువకుడు (20), తన ఇంటి సమీపంలో ఉండే చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు.

Similar News

News March 1, 2025

పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యం: కలెక్టర్

image

ఆర్థికంగా అత్యంత వెనుక బడిన కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ద్వారా జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లకు ఆయన పేదరిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.

News March 1, 2025

మారేడుమిల్లి: పింఛన్లు పంపిణీలో ప్రథమం

image

అల్లూరి జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీలో మారేడుమిల్లి మండలం 95.61 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని MPDO విశ్వనాధ్ శనివారం తెలిపారు. మండలంలో పలు గ్రామాల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమంను ఆయన పర్యవేక్షించారు.1935 మందికి పింఛన్లు మంజూరు కాగా 1850 మందికి ఇప్పటి వరకు ఇచ్చామన్నారు. గత 5నెలలుగా ఈ మండలమే ప్రథమంగా నిలుస్తుందని తెలిపారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

News March 1, 2025

CT ఫైనల్లో ఆ జట్టే గెలుస్తుంది: ఆసీస్ మాజీ కెప్టెన్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు వెళ్తాయని మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. తుది పోరులో ఆస్ట్రేలియాను టీమ్ ఇండియా ఒక్క పరుగు తేడాతో ఓడిస్తుందని జోస్యం చెప్పారు. దుబాయ్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని, భారత ప్లేయర్లు మంచి ఫామ్‌లో ఉన్నారని తెలిపారు. కెప్టెన్ రోహిత్ శర్మ అటాకింగ్ గేమ్ భారత్‌కు కీలకంగా మారనుందన్నారు.

error: Content is protected !!