News February 20, 2025
దోర్నాల: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దోర్నాల గుండా శ్రీశైలం వెళ్లే భక్తులను అటవీశాఖ అధికారులు 24 గంటలు అనుమతించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకాశం జిల్లా డీఎఫ్వో మాట్లాడుతూ.. 24 గంటల అనుమతి అని అసత్య ప్రచారం సాగుతుందని, భక్తులకు ఈ మార్గంలో రాత్రి 9 గంటల వరకే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News February 22, 2025
సెలవు రోజు కూడా బిల్లులు కట్టవచ్చు: ఎస్ఈ

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకొనే కేంద్రాలు 23వ తేదీ ఆదివారం పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం సెలవు రోజు అయినా ఆదివారం కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. నెల ఆఖరు అయినా బిల్లులు చెల్లించలేదని విచారం వ్యక్తం చేశారు.
News February 22, 2025
యర్రగొండపాలెం MLA సంచలన ట్వీట్

కూటమి ప్రభుత్వంపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకాశం జిల్లా పొట్ట కొట్టి, అమరావతి నడుముకు నగషీలు చెక్కడం ధర్మమా?. కృష్ణా నది వరదలకు అమరావతి మునిగిపోకుండా ఉండేందుకు రూ.458.12 కోట్లతో వరద నియంత్రణ చేయనున్నారు. ఆ డబ్బులు వెలిగొండ పునరావాసం కోసం వాడితే రూ.25 లక్షల మందికి తాగునీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు వస్తుంది’ అంటూ Xలో ట్వీట్ చేశారు.
News February 22, 2025
ఒంగోలు: పెళ్లిలో భోజనాల వద్ద గొడవ

పెళ్లిలో భోజనాల గొడవ గాలివానలా పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఒంగోలులోని ఓ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి పెళ్లి జరిగింది. అందులో జిలానీ భోజనాలు వడ్డిస్తుండగా, తమకు సరిగా మర్యాద చేయలేదని అన్వర్, నజీర్, సూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతటితో వివాదం ముగిసిందనగా, విందు ముగిసిన తరువాత జిలానీపై ముగ్గురు దాడి చేశారు. జిలానీ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.