News July 26, 2024

ధరల పట్టిక తప్పనిసరిగా ఉండాలి: ఈవో

image

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు. త్వరలో ఆహార భద్రత ప్రమాణాలపై అన్నప్రసాదం సిబ్బంది, హోటల్‌ యజమానులకు శిక్షణ ఇస్తామన్నారు. తిరుమలలోని ప్రతి హోటల్ వద్ద ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News October 1, 2024

చిత్తూరు: ‘నవంబర్ 15 లోపు అందజేయాలి’

image

ST గ్రామాలలో బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేనివారికి నవంబర్ 15లోపు అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం వాటి మంజూరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 588 హాబిటేషన్లో సుమారు 60 వేల మంది ఉన్నారని.. వారికి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నట్టు కలెక్టర్ చెప్పారు. వాటిపై చర్యలు చేపట్టాలన్నారు.

News September 30, 2024

తిరుపతి : రేపు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు

image

శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ నందు కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు మంగళవారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్, అనస్తీషియా టెక్నీషియన్, జూనియర్/ సీనియర్ ఫిజీషియన్ అసిస్టెంట్ మొత్తం 6 రకాల పోస్టులు 8 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు http://slsmpc.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News September 30, 2024

SVU : ఫీజు చెల్లించడానికి నేడు చివరి తేదీ

image

SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.