News March 20, 2025

ధర్మపురి: రథోత్సవంలో జేబుదొంగ

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవంలో ఓ జేబుదొంగ పోలీసులకు చిక్కాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కొనసాగింది. రథాల వద్ద ఉన్న ఓ భక్తుని జేబులో చేయి పెడుతుండగా అక్కడే ఉన్న గొల్లపల్లి ఎస్ఐ సతీష్ గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వెంటనే సదరు వ్యక్తి జేబును వెతకగా జేబులో నుంచి దాదాపు నాలుగైదు పర్సులు, కొంత నగదు లభించాయి. వెంటనే జేబుదొంగను స్టేషన్ కు తరలించారు.

Similar News

News March 20, 2025

వనపర్తి: జిరాక్స్, మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల బంద్‌‌కు కలెక్టర్ ఆదేశాలు

image

రేపటి నుంచి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని జిరాక్స్, మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలు మూసి వేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు మూసి ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News March 20, 2025

పామాయిల్ సాగుతో లాభాలు: వనపర్తి కలెక్టర్

image

పామాయిల్ సాగు చేస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. రైతులకు అవగాహన కల్పించి పామాయిల్ సాగుకు ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. పంట సాగు 4 సంవత్సరాల వరకు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, పంటను కంపెనీ వారే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. 4 సంవత్సరాలు చూసుకుంటే 35 సంవత్సరాల పాటు లాభాలను ఆర్జించవచ్చని తెలిపారు.

News March 20, 2025

వనపర్తి: ఈ యాప్ డౌన్లోడ్ చేశారంటే మీ అకౌంట్ ఖాళీ: పోలీసులు 

image

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామ వాట్సాప్ గ్రూపులో పీఎం కిసాన్ నిధి యోజన అనే APK డాక్యుమెంట్ వాట్సాప్ గ్రూప్‌లో రావడంతో కొందరు యువకులు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేయగా వారి ఫోన్ హ్యాకింగ్ గురై వాట్సాప్ గ్రూపులన్నింటికీ APK ఫార్వర్డ్ అవుతుంది. కావున పీఎం కిసాన్ యోజన్ అంటూ మెసేజ్ వస్తే దాన్ని ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

error: Content is protected !!