News December 21, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,39,961 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.78,396 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.41,040, అన్నదానం రూ.20,525,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ వివరించారు.
Similar News
News December 22, 2024
వీణవంక: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బండారి చేరాలు బైక్‌పై జమ్మికుంటకు వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టంది. ఈ ప్రమాదం బేతిగల్ శివారులో జరిగింది. తీవ్ర గాయాలైన చేరాలుని చికిత్స నిమిత్తం హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేరాలు భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు.
News December 22, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ జూలపల్లి మండలంలో విద్యుత్ షాక్‌తో 15 గొర్రెలు మేకలు మృతి.
@ కోరుట్ల మండలంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి.
@ మల్లాపూర్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య.
@ తంగళ్లపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ గొల్లపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించిన మెట్పల్లి కోర్ట్ మెజిస్ట్రేట్.
News December 21, 2024
శాతవాహన యూనివర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల
గత మూడు సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో ఎలాంటి పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా వేల మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని ఇటీవల జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య ఆధ్వర్యంలో వీసీ దృష్టికి తీసుకెళ్ళారు. శనివారం వీసీ ఉమేష్ కుమార్ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల జేఏసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. వీసీ కి జేఏసీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.