News January 12, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,25,314 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,16,714, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.89,590, అన్నదానం రూ.19,010 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News January 12, 2025
కరీంనగర్: సంక్రాంతికి మన జిల్లాలో సకినాలే ఫేమస్
సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ముగ్గులు, పతంగులు. కొన్నిచోట్ల అయితే కోళ్ల పందేలు. కానీ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం గుర్తొచ్చేది సకినాలు. అవును.. సకినాలనేవి సంక్రాంతి సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ఫేమస్. ప్రతి ఇంటి పిండి వంటలో ఇవి కచ్చితంగా ఉంటాయి. ఇవి లేకుండా ఓల్డ్ కరీంనగర్ జిల్లాలో పండుగనే జరగదు. మరి ఇంట్లో సకినాలు చేశారో? లేదో కామెంట్ చేయండి.
News January 11, 2025
BRS కార్యాలయంపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి: కేటీఆర్
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ Xలో స్పందించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండారాజ్యం చలాయిస్తున్నారని పలు వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
News January 11, 2025
కరీంనగర్: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
ఉమ్మడి KNR జిల్లాలో నిన్న జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. జగిత్యాల(D)లో జరిగిన <<15121069>>రోడ్డు <<>>ప్రమాదంలో జాబితాపూర్ వాసులు అరవింద్, సాయి, కొండాపూర్ వాసి వంశీ మృతిచెందారు. పుట్టిన రోజు <<15121119>>వేడుకలు <<>>జరుపుకోని వస్తున్న మంగపేట వాసి రాజకుమార్, అప్పన్నపేట వాసి అభినవ్‌ను బొలెరో ఢీకొట్టింది. చిన్నకల్వల వాసి ఈశ్వరమ్మను సుల్తానాబాద్ వద్ద <<15121180>>లారీ <<>>ఢీకొనడంతో మరణించింది.