News February 3, 2025
ధర్మపురి: శ్రీ లక్ష్మీనరసింహుడి ఆదాయం ఎంతంటే..
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వివిధ కార్యక్రమాల ద్వారా అదివారం రూ.2,52,508ల ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,27,092, ప్రసాదాల అమ్మకం- రూ.95,820, అన్నదానం- రూ.29,596లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
Similar News
News February 3, 2025
NZB: బీజేపీ జిల్లా అధ్యక్షునిగా కులచారి దినేశ్
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కులచారి దినేశ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.కాసం వెంకటేశ్వర్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల సందర్భంగా దినేశ్ కులచారి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
News February 3, 2025
ప్రభాస్ ‘కన్నప్ప’ లుక్‌పై ట్రోల్స్
కన్పప్పలో ప్రభాస్ లుక్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డార్లింగ్ లుక్ ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో నాగార్జున లుక్‌ను పోలి ఉందని పలువురు పోస్టులు చేస్తున్నారు. విగ్ సెట్ అవలేదని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా లుక్‌పై ఫోకస్ చేయాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ లుక్‌పై మీ కామెంట్?
News February 3, 2025
గద్వాల ప్రజావాణిలో 28 దరఖాస్తులు.!
గద్వాల జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 28 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.