News March 17, 2025
ధర్మవరం: చిగిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం.

ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న బోయ నారాయణ స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా ద్విచక్ర వాహనంలో వస్తుండగా చిగిచెర్ల వద్ద మరో వాహనం ఢీకొనడంతో నారాయణ స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నారాయణ స్వామి మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Similar News
News March 17, 2025
నేటి నుంచి ‘యువ వికాసం’ దరఖాస్తులు షురూ

TG: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 5వరకూ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం రూ.లక్ష నుంచి 3లక్షల వరకూ రుణాలు అందించనున్నారు. ఇందులో 60-80% వరకు రాయితీ ఉంటుంది. రూ.6 వేల కోట్లతో 5లక్షల మంది యువతకు రుణాలిచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దరఖాస్తుకు సైట్: tgobmms.cgg.gov.in
News March 17, 2025
బీబీనగర్: అర్ధరాత్రి చోరీ.. బైక్‌పై దొంగలు!

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమారంలో ఆదివారం అర్ధరాత్రి తాళాలు వేసిన ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు తిరుగుతుండగా సీసీ కెమెరాలలో రికార్డైంది. బీబీనగర్ పెట్రోలింగ్ పోలీసులు దొంగలు చొరబడిన ఇళ్లను పరిశీలించారు. బాధితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News March 17, 2025
టెన్త్ విద్యార్థులకు ఫ్రీ బస్

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విశాఖ జిల్లాలోని విద్యార్థులందరినీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 7 డిపోల నుంచి 150 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా సమయానికి ముందు, ముగిసిన తర్వాత 2.30 గంటల వరకు బస్సులు షెడ్యూల్, స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హాల్ టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.