News April 7, 2025
ధర్మవరంలో రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్

ధర్మవరం ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో ఈనెల 6 నుంచి 9 వరకు 15వ ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ హాకీ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 22 టీంలు, 440 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News April 17, 2025
వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు..$700Mలతో బిగ్ డీల్!

భారత్, వియత్నాం మధ్య బ్రహ్మోస్ క్షిపణుల డీల్ తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. 700 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను ఆ దేశానికి సరఫరా చేసేలా భారత్ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. చైనాతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వియత్నాం ఈ క్షిపణులను కొనుగోలు చేసుకుంటుంది. కాగా 2022లో తొలిసారిగా 375 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు భారత్ అందించింది.
News April 17, 2025
కాకినాడ: బాలికపై వ్యక్తి అత్యాచారం.. కేసు నమోదు

నగరానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో చేపల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. కాగా గత కొంత కాలంగా ఆ మహిళ సతీశ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. బుధవారం వ్యాపారం నిమిత్తం ఆమె బయటకు వెళ్లగా ఇంట్లో ఉన్న బాలికపై లోకేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన తల్లి ఆ విషయం తెలుసుకుని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
News April 17, 2025
భూభారతి పోర్టల్‌పై రైతులు అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

నేరేడుచర్లలో గురువారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి పోర్టల్‌పై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఈ పోర్టల్లో పది మాడ్యూల్స్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఎఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ పొందుపరిచారని తెలిపారు.