News February 10, 2025

ధర్మార: ప్రియురాలు నో చెప్పిందని యువకుడు సూసైడ్

image

ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామానికి చెందిన గడ్డం అజయ్ (22) తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోను అని అనడంతో మనస్తాపం చెంది గతనెల 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా,చికిత్స పొందుతూ అజయ్ ఆదివారం మృతిచెందినట్లు ధర్మారం SI శీలంలక్ష్మణ్  తెలిపారు. అజయ్ తండ్రి గడ్డం ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News March 12, 2025

భయమనేది నా రక్తంలోనే లేదు: విజయసాయి

image

AP: కాకినాడ పోర్టు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. ‘కావాలనే కొందరు నన్ను ఈ కేసులో ఇరికించారు. కేవీ రావుతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆయనంటేనే నాకు అసహ్యం. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ విక్రాంత్ రెడ్డే. కొందరు ఎదగడానికి నన్ను కిందకు లాగారు. భయమనేది నా రక్తంలోనే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News March 12, 2025

గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు: KTR

image

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30% మించి రైతు రుణమాఫీ జరగలేదని రుణమాఫీ అయిపోయిందని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.

News March 12, 2025

ఉద్యోగం కోసం నిరుద్యోగుల క్యూ!

image

ఓ వైపు 40+ డిగ్రీల ఎండ. ఎప్పుడు లోపలికి పిలుస్తారో తెలియదు. కానీ, ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో గంటల తరబడి లైన్‌లో వేచి ఉన్నారీ నిరుద్యోగులు. ఈ దృశ్యం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అమెజాన్ కంపెనీ వద్ద కనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఇంతమంది రావడంతో నిరుద్యోగం ఎంతలా పెరిగిందో చూడాలంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయని చెబుతున్నారు.

error: Content is protected !!