News November 10, 2024
ధాన్యం అమ్మాలంటే కష్ట పడాల్సిందే..!
భూమి చదును చేసి, నారు మడులు సిద్ధం చేసుకొని, నాటు వేసి.. పంట చేతికొచ్చి.. విక్రయించి చేతికి డబ్బులు వచ్చే దాక రైతుకు అన్ని కష్టాలే. కొన్ని చోట్ల ముందస్తు వరి కోతలు షురూ కాగా..మరి కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి. పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్ల పై ఎండ బెట్టారు. ధాన్యంలో తేమశాతం తగ్గేలా ఓ రైతు ధాన్యాన్ని తిరగేస్తున్న దృశ్యాన్ని ‘WAY2NEWS’ పిట్లంలో హై వే-161 వద్ద తన కెమెరాలో బంధించింది.
Similar News
News November 14, 2024
రెంజల్: కల్లు సీసాలో బల్లి కలకలం
కల్లు సీసాలో బల్లి కలకలం రేపిన ఘటన రెంజల్‌లో చోటుచేసుకుంది. బుధవారం మండల కేంద్రంలోని ఓ కల్లు బట్టిలో ఓ వ్యక్తి కొన్న కల్లు సీసాలో బల్లి ప్రత్యక్షమైంది. గమనించకుండా అతడు కల్లు తాగడంతో అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే తోటి వారు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారులు దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, స్థానికులు కోరుతున్నారు.
News November 14, 2024
దుబాయ్‌లో అమ్ధాపూర్ వాసి మృతి
బోధన్ మండలంలోని అమ్ధాపూర్ గ్రామానికి చెందిన హరికృష్ణ (38) దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హరికృష్ణ గత నెల అక్టోబర్ 24వ తేదీన బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్టోబర్ 31న రోడ్డు దాటుతుండగా కారు ప్రమాదంలో మరణించాడు. మృతదేహం గురువారం స్వగ్రామానికి రానున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News November 14, 2024
రేపు ఎడపల్లి మండలానికి మంత్రి జూపల్లి రాక
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో రేపు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి జూపల్లి పర్యటన ఎడపల్లి మండలంలో సైతం ఉండనున్నట్లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సొసైటీ ఛైర్మన్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సొసైటీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు.