News March 26, 2025

ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ: ఖమ్మం కలెక్టర్

image

యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన వెయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్, గన్ని సంచులు మొదలైన మౌలిక వసతులు ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News March 29, 2025

KMM: ఫ్యాన్‌కు ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

image

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక మసీదు రోడ్డుకు చెందిన షేక్ ఆలీబాబా అలియాస్ బన్ను(24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 29, 2025

ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: మంత్రి

image

ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం V. వెంకటాయపాలెం గ్రామంలో బీటీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.

News March 29, 2025

ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలి: తుమ్మల

image

ఖమ్మం: కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్తంభాద్రి పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లక్ష్మి, కమర్తపు మురళి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సాదు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!