News March 6, 2025
ధూళ్‌మిట్ట: ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి

ధూళ్‌మిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు భోషనబోయిన సాయిలు(70) ప్రమాదవశాత్తు తన వ్యవసాయ బావిలో పడి బుధవారం రాత్రి మరణించారు. బావిలో పంపు మోటర్ చెడిపోవడంతో దానికి సాయిలు మరమ్మతులు చేపట్టారు. అనంతరం బావిలో నుంచి పైకి ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.
Similar News
News March 6, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ వడ్డాదిలో ఘనంగా మోదకొండమ్మ తీర్థం ➤ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి: MLA కొణతాల ➤ చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్ పీడీకీ సత్కారం ➤ ఈ నెల 10న అనకాపల్లి సత్యనారాయణ స్వామి కళ్యాణం➤ గీత కార్మికుల 15 వైన్ షాపులకు లాటరీ ప్రక్రియ పూర్తి➤ నర్సీపట్నం బీసీ హాస్టల్ తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్➤ పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పీ-4 సర్వే: జిల్లా కలెక్టర్➤ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్
News March 6, 2025
తిరుపతి: ఇంటర్ పరీక్షలకు 33228 మంది హాజరు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ పరీక్షలకు జనరల్, ఓకేషనల్ కలిపి 33,228 మంది హాజరైనట్టు ఆర్ఐవో ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జనరల్ 86 కేంద్రాల్లో 32830 మందికి 849 మంది గైర్హాజరు కాగా 31981 మంది హాజరైయ్యారు. ఓకేషనల్ 15 కేంద్రాల్లో 1341 మందికి గాను 94 మంది గైర్హాజరయ్యారు కాగా 1247 మంది హాజరైయ్యారు. మొత్తం 34171 మందికి గాను 943 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు.
News March 6, 2025
పెద్దపల్లి: ప్రశాంతంగా రెండో రోజు పరీక్షలు

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ రెండవ సంవత్సరం మొదటి పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాష పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు (4900) మంది హాజరు కావాల్సి ఉండగా, (4796)మంది హాజరు కాగా,(104) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారన్నారు. 97.87% హాజరు నమోదు కావడం జరిగిందన్నారు.