News April 19, 2025
ధైర్యంగా, తెలివిగా వ్యవహరించండి: అన్నమయ్య ఎస్పీ

‘ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీరు ధైర్యంగా, తెలివిగా వ్యవహరిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు’ అని SP విద్యాసాగర్ నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా, ప్రశాంతంగా సమస్య ఏమిటో పూర్తిగా తెలుసుకోండి. దాని మూలాలు, ప్రభావంపై విశ్లేషించండి. సమస్య పరిష్కరణకు ప్రణాళికను రూపొందించుకోండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, నిపుణుల సలహా తీసుకోండి’ అని ప్రజలకు సూచించారు.
Similar News
News April 20, 2025
DSC: అనంతపురం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. అనంతపురం జిల్లాలో 145 ఎస్ఏ పీఈటీ, 202 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 807 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 2 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయి.
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
News April 20, 2025
మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్: రేపే హాల్ టికెట్లు

TG: మోడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి ఈనెల 27న నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు రేపు అందుబాటులోకి రానున్నాయి. https://telanganams.cgg.gov.in/ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 27న ఉ.10 నుంచి మ.12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, అదే రోజు మ.2 నుంచి సా.4 గంటల వరకు 7-10 తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష జరగనుంది.