News January 24, 2025
నందవరంలో చౌడేశ్వరి ఆలయంలో పూజలు

బనగానపల్లె మండలం నందవరంలో వెలసిన చౌడేశ్వరి మాత ఆలయంలో పుష్య మాసం శుక్రవారం పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరి, అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Similar News
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. సంగారెడ్డి జిల్లా ఎదురుచూస్తోంది..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మంజీరా నదిలో నక్క వాగు నీళ్లు కాలుష్యం కాకుండా చూడాలి. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలి. ప్యారానగర్ డంప్ యార్డు రద్దు చేయాలి. సింగూరు జిల్లా మొత్తం నీళ్లు తాగుకు, సాగుకు అందించాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలి.
News March 12, 2025
కరీంనగర్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

కరీంనగర్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన కరుణాకర్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. హుస్నాబాద్ మండడం మహ్మాదాపూర్‌కి చెందిన నర్సింహాచాలి ఆనారోగ్యంతో ఉరేసుకున్నాడు. మానకొండూర్ మండలం పోచంపల్లికి చెందిన అంజయ్య మానసిక స్థితి సరిగా లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 12, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు (బుధవారం) విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ 71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా వల్లభనేని వంశీ పై పలు కేసులు నమోదయ్యాయి.