News June 17, 2024

నందికొట్కూరు: ‘కాలువ నీళ్లే తాగాడానికి వదులుతున్నారు’

image

పాములపాడు మండలంలోని వానాల గ్రామంలో ఎస్సీ కాలనీవాసులకు తెలుగు గంగ నీళ్లు వదులుతున్నారని కాలనీవాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. నీళ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయని వాటిని తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. అలాగే డయేరియా సంబంధిత వ్యాధులు సంభవించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని మంచి నీటిని సరఫరా చేయాలని కోరారు.

Similar News

News October 3, 2024

నంద్యాల జిల్లాలో హత్య.. అనుమానమే కారణం!

image

కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో హత్య జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం మేరకు.. భార్య పార్వతిని భర్త రామమోహన్ గొడ్డలితో నరికి చంపాడు. వీరికి వివాహమై 16ఏళ్లు కాగా కొద్దిరోజులుగా భర్త భార్యకు దూరంగా ఉన్నాడు. ఇటీవల మళ్లీ ఆమె వద్దకు వచ్చిన ఆయన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవలు పడేవారు. ఇవాళ తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News October 3, 2024

నంద్యాల జిల్లాలో మహిళ హత్య

image

నంద్యాల జిల్లాలో మరో దారుణ హత్య జరిగింది. కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో ఓ భర్త భార్యను కిరాతకంగా చంపాడు. భార్యపై అనుమానంతో గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 3, 2024

శ్రీగిరిలో నేటి నుంచి దసరా ఉత్సవాలు

image

శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబాదేవి అమ్మవారు దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు మినహా మిగిలిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. వాహనసేవలను సామాన్య భక్తులు వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. వాహన సేవలు, గ్రామోత్సవం, తెప్పోత్సవాలను భక్తులు <>శ్రీశైలటీవీ<<>> ద్వారా లైవ్ చూడొచ్చు.