News June 21, 2024
నంద్యాల: ఎస్సై మారుతీ శంకర్‌కు ఏడాది జైలు శిక్ష
పగిడ్యాల మండలంలో పనిచేసిన ఎస్సై మారుతీ శంకర్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి దివ్య గురువారం తీర్పునిచ్చారు. ఘనపురంలో 2015లో నరేంద్రరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు. కేసు విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు రావాలని నరేంద్రరెడ్డిని ఎస్సై పిలవగా వారెంట్ ఉంటేనే వస్తానని చెప్పాడు. దీంతో ఎస్సై కోపంతో దాడిచేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
Similar News
News January 15, 2025
నంద్యాల: సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్.. ప్రేమ వ్యవహారమే కారణమా?
కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అంబటి రామచంద్రారెడ్డి, శివగంగ దంపతుల కుమారుడు శివరాఘవరెడ్డి(25) అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రాఘవరెడ్డి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పలువురు పేర్కొంటున్నారు.
News January 15, 2025
జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం తూర్పు ప్రాతకోటలో వెలసిన నాగేశ్వరస్వామి సంక్రాంతి తిరుణాళ్ల సందర్భంగా జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను హైకోర్టు న్యాయమూర్తి ఎన్.హరినాథ్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల శేషమ్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 12 మహిళా జట్లు పాల్గొన్నాయి.
News January 14, 2025
కర్నూలు: కన్ను తెరిచిన పార్వతీ దేవి..!
కర్నూలు మండలం గార్గేయపురం గొల్ల వీధిలోని అతి పురాతన బావిలో ఉన్న శివాలయం నందు పార్వతీ దేవి విగ్రహం కన్ను తెరిచారనే ప్రచారం వైరలవుతోంది. ఈ విషయం తెలిసిన జనాలు పక్క ఊర్ల నుంచి తండోపతండాలుగా అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తాలూకా పోలీసులు చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు తోసుకోకుండా అమ్మవారిని చూసేందుకు ఒక్కొక్కరిని పంపుతున్నారు.