News March 9, 2025
నంద్యాల కలెక్టరేట్‌లో రేపు ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల పట్టణం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News March 10, 2025
శ్రేయస్ సైలెంట్ హీరో.. రోహిత్ శర్మ ప్రశంసలు

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్(243)పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. అతనో సైలెంట్ హీరో అని కొనియాడారు. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారని, మిడిలార్డర్‌లో చాలా ముఖ్యమైన ప్లేయర్ అని చెప్పారు. ఈ విజయాన్ని భారత అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు హిట్ మ్యాన్ పేర్కొన్నారు. కాగా ఫైనల్లో అయ్యర్ 62 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 48 పరుగులు చేశారు.
News March 10, 2025
నవాబుపేట : బాలుడిపై కత్తితో దాడి.. అనంతరం పరారీ

నవాబుపేట మండలంలో దారుణం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విజయ్ కుమార్‌పై అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు 108 సిబ్బంది ద్వారా మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రం తెలిపారు.
News March 10, 2025
టీడీపీలోనే ఉంటా.. ఏ పార్టీలో చేరను: జేసీ పవన్ రెడ్డి

పార్టీ మార్పుపై ప్రచారాన్ని JC పవన్ రెడ్డి కొట్టిపారేశారు. తాను టీడీపీలో ఉన్నానని, ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీలోకి వెళ్తున్నట్లు చెప్పడానికే మాజీ మంత్రి శైలజానాథ్ తనను కలిశారని, నిర్ణయం తీసుకున్నాక తాను ఏమి చేయగలనని, ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలిపారు. దావోస్ పర్యటనలో అనంతపురం జిల్లాలో రూ.1000కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలతో ఎంవోయూ కుదర్చగలిగానని చెప్పారు.