News April 17, 2025

నంద్యాల జిల్లా టుడే TOP NEWS.!

image

☞మాదకద్రవ్యాల నిర్మూలనకు QR కోడ్: ఎస్పీ
☞పద్మ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం: DSO రాజు
☞డోన్ మండలంలో బాలికపై అత్యాచారం
☞గిరిజనులకు సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్
☞పవన్ కళ్యాణ్ కుమారుడిపై అసభ్య వ్యాఖ్యలు.. గూడూరు యువకుల అరెస్ట్.

NOTE:- పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.

Similar News

News December 13, 2025

VZM: ఉమ్మడి జిల్లాలో 9,513 కేసుల పరిష్కారం

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 9,513 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్‌లో సివిల్ 424, క్రిమినల్ 9,028, ప్రీ-లిటిగేషన్ 61 కేసులు పరిష్కారమయ్యాయని సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు. మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్‌కు రూ.90 లక్షల పరిహారం అందజేశారు.

News December 13, 2025

రెండో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: మెదక్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాహుల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో పోలింగ్ మెటీరియల్ పంపిణీని ఆయన పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ సిబ్బంది మార్గదర్శకాలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు, అనంతరం లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు.

News December 13, 2025

ఉప్పల్‌‌లో ఫుట్‌బాల్ మ్యాచ్.. CM, మెస్సీ ఆడేది అప్పుడే!

image

సింగరేణి RR-9 వర్సెస్ అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య ఉప్పల్‌లో మ్యాచ్ షురూ అయ్యింది. 7v7 ఎగ్జిబిషన్/సెలిబ్రిటీ మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్ చివర్‌లో తెలంగాణ CM రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్‌లోకి దిగి మెస్సీతో కలిసి ఆడనున్నారు. అంతకుముందు మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి చిన్నపిల్లలకు ఫుట్‌బాల్ క్లినిక్ నిర్వహించి, వాళ్లకు టెక్నిక్స్ నేర్పిస్తారు. ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు ఇది పండగే.