News March 17, 2025
నంద్యాల జిల్లా టుడే టాప్ న్యూస్

➤ నంద్యాల జిల్లాలో మొదలైన పదో తరగతి పరీక్షలు
➤ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి
➤ కలెక్టర్ కార్యాలయంలో 209 అర్జీల స్వీకరణ
➤అహోబిలం బ్రహ్మోత్సవాలకు భారీ ఆదాయం
➤ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఏఎస్పీ జావలి
➤RMP వేధింపులు… మహిళ ఆత్మహత్యాయత్నం
Similar News
News March 18, 2025
భీకర దాడి.. 342 మంది మృతి

ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో భారీగా <<15798213>>మరణాలు<<>> సంభవిస్తున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకు 342 మంది పాలస్తీనీయులు మరణించారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, తమ దేశానికి చెందిన మిగిలిన 59 మంది బందీలను విడుదల చేయకపోతే గాజాపై దాడులు మరింత ముమ్మరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హమాస్ గ్రూపును హెచ్చరించారు.
News March 18, 2025
మెదక్: ఎండిపోతున్న వరి.. రైతుల ఆందోళన

మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో జిల్లాలో చాలాచోట్ల వరిపంటలు ఎండిపోతున్నాయి. నీరందక చేగుంట మండలం పొలంపల్లిలో వరి ఎండిపోతుంది. దీనికి తోడు ఎండలు సైతం ముదరడంతో వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రామంలో దాదాపు 20 ఎకరాల వరి బీటలు బారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
News March 18, 2025
ఐదు సినిమాలు.. దేనికోసం వెయిటింగ్?

ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో ఐదు కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కు సీక్వెల్‌గా వస్తోన్న ‘మ్యాడ్ స్క్వేర్’, హీరో నితిన్ నటిస్తోన్న ‘రాబిన్ హుడ్’, మోహన్ లాల్ నటిస్తోన్న ‘ఎల్2: ఎంపురాన్’, హీరో విక్రమ్ ‘వీర ధీర శూర’ పార్ట్-2తో పాటు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘సికందర్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇంతకీ మీరు ఏ సినిమాకు వెళ్తారు? కామెంట్ చేయండి.