News April 18, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్యాంశాలు

*ప్యాపిలి మండలంలో 65 లీటర్ల నాటుసారా సీజ్*నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్ దారుణ హత్య?*గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొన్న నంద్యాల ఎంపీ*6 నెలల్లో సోలార్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం: కేంద్ర మంత్రి*జొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: శ్రీశైలం MLA *నంద్యాల జిల్లాలోని మండలాల్లో ఈదురుగాలులు.. రైతులకు తీవ్రనష్టం*అహోబిలంలో కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు
Similar News
News April 20, 2025
చంద్రబాబుకు YS జగన్ బర్త్‌డే విషెస్

AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ CM వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని Xలో పోస్ట్ చేశారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
News April 20, 2025
వై.రామవరం: ఆ చెట్టుకు ఆకులు కంటే కాయలే ఎక్కువ

ప్రకృతి అందాలతో కళకళలాడే అల్లూరి జిల్లా పలు వింతలకు నిలయం. వై.రామవరం మండలం గుమ్మరిపాలెం సమీపంలో అడవికి దగ్గరగా ఉన్న ఈ మామిడి చెట్టు అప్రాంతాన్ని వెళ్లే వారిని ఆకట్టుకుంటుంది. ఆకులు కంటే కాయలే ఎక్కువగా కనిపించడంతో ఆ చెట్టును చూడకుండా ఉండలేరు. గుత్తులు గుత్తులుగా వందలాది కాయలతో దర్శనం ఇస్తోంది. పండు చిన్నది అయినా చాలా తీయగా, రుచిగా ఉంటుందని స్థానికులు తెలిపారు.
News April 20, 2025
పెద్దపల్లి: హిందువులంతా ఏకమై ఉద్యమిస్తాం: విశ్వహిందూ పరిషత్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హిందూ సమాజాన్ని ఏకం చేసి ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.