News February 26, 2025
నంద్యాల జిల్లాకు జబర్దస్త్ నటుడి రాక

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌తో పాటు, పలు నాటక ప్రదర్శనలు, సినిమాల్లో కామెడీ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రజలను మెప్పిస్తున్న జబర్దస్త్ నటుడు అప్పారావు నేడు (బుధవారం) కొలిమిగుండ్ల మండలం పెట్నికోటకు రానున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెట్నికోట శ్రీ గుండు మల్లేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం రాత్రి చింతామణి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో అప్పారావు సుబ్బిశెట్టి పాత్ర వేస్తున్నారు.
Similar News
News February 26, 2025
టాప్-5లోకి కోహ్లీ

ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కింగ్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకొని ఐదో ర్యాంకుకు చేరారు. ఇక నం.1 స్థానంలో 817 పాయింట్లతో గిల్ కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్, రోహిత్ శర్మ, క్లాసెన్ ఉన్నారు. మరోవైపు వన్డేల్లో టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
News February 26, 2025
మార్చి 2 వరకు జాగ్రత్త!

తెలంగాణలో 5 రోజుల పాటు ( ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2) ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రత 37డిగ్రీల నుంచి 40డిగ్రీలు చేరుకునే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌లో 34-37 డిగ్రీల మధ్య ఉండొచ్చని వెల్లడించింది. దీంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండలో బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
News February 26, 2025
విమాన ప్రమాదంలో 46కు చేరిన మరణాలు

సూడాన్‌లో జరిగిన <<15582145>>విమాన ప్రమాదంలో<<>> మరణాల సంఖ్య పెరిగింది. ఓమ్డర్మన్ నగరంలో జరిగిన ఘటనలో మరణాలు 46కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడినట్లు వెల్లడించారు. పౌర నివాసాలపై విమానం కూలడంతో మిలిటరీ సిబ్బందితో పాటు పౌరులు చనిపోయారని పేర్కొన్నారు. 2023 నుంచి సూడాన్‌లో ఆర్మీకి ర్యాపిడ్ దళాలకు మధ్య యుద్ధం జరుగుతోంది.