News March 9, 2025

నంద్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

☞ అబద్ధపు హామీలతోనే టీడీపీ గద్దెనెక్కింది: కాటసాని ☞ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ ☞ గాజుల పల్లెలో రైల్వే బోగీల తొలగింపు.. రైళ్ల రాకపోకల పున:ప్రారంభం ☞ ఆళ్లగడ్డలో మొబైల్ షాప్ ఓపెనింగ్.. ఓనర్, కస్టమర్ మధ్య వివాదం ☞ అర్ధరాత్రి కర్నూలుకు పోసాని ☞ బనగానపల్లెలో ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ఢీ ☞ బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య ☞ అధికారంతో దాడులు చేసింది వైసీపీనే: కాట్రెడ్డి

Similar News

News March 10, 2025

KMR: కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి మృతి

image

కూతురును పుట్టిందన్న సంతోషంలో కామారెడ్డి జిల్లాలోని అత్తగారింటికి వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం వాసి నరేశ్ (28)కు నెల క్రితం కూతురు పుట్టింది. బీబీపేట మండలం మల్కాపూర్‌లోని అత్తగారింట్లో ఉన్న భార్య, పాపను తీసుకురావడానికి ఆదివారం బైక్‌పై వెళ్తున్నాడు. ఆకారం శివారులో ఆటో ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. కేసు నమైదైంది.

News March 10, 2025

నేడు యాదాద్రికి రానున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి విచ్చేసి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.  

News March 10, 2025

సుల్తానాబాద్: ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

కాట్నపల్లిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లగా ఒకరు మృతిచెందాడు. మోరపెల్లి అవినాశ్ రెడ్డి(15) ఆదివారం తన స్నేహితుడు సూర్యవంశీతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లారు. అవినాశ్ బావిలో దిగగా వెంటనే మునిగిపోవడం చూసిన సూర్యవంశీ పరిగెత్తుకుని వెళ్లి బంధువులతో బావి దగ్గరికి వచ్చాడు. బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

error: Content is protected !!