News March 15, 2025

నంద్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

☞ ఆళ్లగడ్డలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
☞ అహోబిలంలో చీఫ్ సెక్రటరీ ప్రత్యేక పూజలు
☞ గోస్పాడు మండలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత
☞ సంజన్న హత్య.. కంటతడి పెట్టిన ఎంపీ శబరి
☞ నందికొట్కూరులో భార్యను హతమార్చిన భర్త
☞ కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష
☞ నంద్యాలలో అధిక ధరలకు స్టాంపులు దందా
☞ పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
☞ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమం

Similar News

News March 16, 2025

అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 22,042 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలికలు 10,968 మంది, బాలురు 11,074 మంది ఉన్నట్లు తెలిపారు. 31 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.

News March 16, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మంథని 40.8℃ నమోదు కాగా రామగిరి 40.6, పాలకుర్తి 40.5, అంతర్గం 40.4, కమాన్పూర్ 40.3, సుల్తానాబాద్ 40.2, ఓదెల 40.1, ముత్తారం 39.7, కాల్వ శ్రీరాం 39.5, రామగుండం 39.4, పెద్దపల్లి 39.3, ధర్మారం 38.4, ఎలిగేడు 37.7, జూలపల్లి 36.3℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.

News March 16, 2025

పెనుబల్లి: మేక పంచాయితీ.. దాడి, ఫిర్యాదు.!

image

మేక తెచ్చిన పంచాయితీలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన కొందరు యువకులు కారులో టేకులపల్లి సాగర్ కాల్వ వద్ద ఈత కొడుతుండగా, అటుగా వచ్చిన మేకల గుంపులోని ఓ మేక కారుపై ఎక్కడంతో, పశువులు కాపరిని యువకులు కొట్టారు. అది గమనించిన స్థానికులు యువకులను కొట్టడంతో మారేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!