News March 1, 2025

నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 15,692 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 550 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST

Similar News

News March 1, 2025

రాజీనామా తర్వాత GV రెడ్డి తొలి ట్వీట్

image

AP: టీడీపీకి <<15567607>>రాజీనామా తర్వాత<<>> బడ్జెట్‌ను అభినందిస్తూ జీవీ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.33,000cr రెవెన్యూ లోటుతోనే రూ.3.2లక్షల కోట్ల బడ్జెట్ రూపొందించారన్నారు. ‘రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం ఉంటుంది. తక్కువ కాలంలోనే పార్టీలో నాకు దక్కిన గౌరవం పట్ల ఆయనకు రుణపడి ఉంటాను. 2029లోనూ మా సార్ CM కావాలి’ అని ట్వీట్ చేశారు.

News March 1, 2025

అల్లూరి జిల్లాలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

image

కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారని కొయ్యూరు ఎస్‌ఐ పీ.కిషోర్ వర్మ తెలిపారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధించనున్నారు.వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి, సహకరించాలని సూచించారు.

News March 1, 2025

రాజా సాబ్.. 3 గంటలు!

image

ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజా సాబ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలో రెండు పాటల కోసం స్పెయిన్ వెళ్లనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయినట్లే. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందని సమాచారం. ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించినా వాయిదా పడే అవకాశం ఉంది.

error: Content is protected !!