News March 31, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు

* కర్ణాటక భక్తులతో పోటెత్తిన మహానంది క్షేత్రం* రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్* ఈద్గాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు* బేతంచర్ల ఈద్గాలో నల్ల బ్యాడ్జిలతో నిరసన * బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తపై దాడి* ఈకేవైసీ గడువును సద్వినియోగం చేసుకోండి: కొలిమిగుండ్ల MRO * వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన
Similar News
News April 3, 2025
ఒంగోలు: నేటి నుంచి 10th స్పాట్ వ్యాల్యువేషన్

10th పబ్లిక్ పరీక్షలు ఈ నెల 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కాగా గురువారం నుంచి 10th స్పాట్ వ్యాల్యువేషన్ నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్‌లో స్పాట్ వ్యాల్యువేషన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సోషల్ స్టడీస్‌కు సంబంధించిన టీచర్స్‌కు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని, మిగిలిన సబ్జెక్టులకు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయని తెలిపారు.
News April 3, 2025
భూపాలపల్లి ఏఐఎస్ఎఫ్ నాయకుల అరెస్ట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూముల అమ్మకాలను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం HYD వెళ్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను పూర్తిగా ఖండించారు. యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు.
News April 3, 2025
మోదీ నాకు గొప్ప స్నేహితుడే కానీ..: ట్రంప్

పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్.. PM మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాకు గొప్ప స్నేహితుడు. కానీ భారత్ మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు. మాపై 52 శాతం టారిఫ్ విధిస్తోంది. మేము ఇండియాపై 26% సుంకం విధిస్తున్నాం’ అని చెప్పారు. సుంకాల ప్రకటనతో అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు. US మార్కెట్లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.