News April 4, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞నంద్యాల GGHలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ☞ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభించిన మంత్రి BC☞కందనాతిలో పిడుగుపాటుతో బాలుడి మృతి☞బనగానపల్లె ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ☞CMRF చెక్కులు పంపిణీ చేసిన MLAలు☞నందవరం చౌడమ్మ హుండీ ఆదాయం రూ.4.21లక్షలు☞మంత్రి లోకేశ్‌ను కలిసిన ఆళ్లగడ్డ MLA☞కేంద్ర మంత్రికి ఎంపీ శబరి వినతి☞8 మంది ఎస్ఐలకు పోస్టింగులు
Similar News
News April 11, 2025
MNCL: ఫూలే జయంతి ఉత్సవాలకు సింగేరేణి నిధులు

సింగరేణివ్యాప్తంగా శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవాల నిర్వహణకు యాజమాన్యం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సంస్థ సీఅండ్ఎండీ బలరామ్ ఆదేశాల మేరకు జీఎం (వెల్ఫేర్) పర్సనల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఫూలే జయంతి ఉత్సవాల నిర్వహణకు బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు రూ.25 వేలు, జైపూర్ లోని ఎస్టీపీపీకి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేశారు.
News April 11, 2025
KMR: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీర్జాపూర్‌కి చెందిన గైక్వాడ్ బాలాజీ.. బాలిక రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్‌లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.
News April 11, 2025
సంగారెడ్డి: జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు: SP

జిల్లాలో 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ గురువారం తెలిపారు. పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.